SDPT: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేశ్ ఆధ్వర్యంలో ధర్మాజీపేట వెళ్లే రోడ్డుకు మరమ్మతుల పనులను ప్రారంభించారు. రోడ్డుపై గుంతలు పడడంతో RTC బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా JCBతో మరమ్మతుల పనులు చేపట్టారు.
TG: ప్రముఖ యూట్యూబర్ కోమలి (21) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా మరో యూట్యూబర్‌తో ప్రేమలో ఉన్న ఆమె, బ్రేకప్ కారణంగా తీవ్ర మనస్థాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఆమె ఓ సారి ఆత్మహత్యాయత్నం చేశారు. BSC చదువుతూ, యూట్యూబ్ వీడియోల ద్వారా గుర్తింపు పొందిన కోమలి మరణం సోషల్ మీడియాలో విషాదాన్ని నింపింది.
MDCL: మల్కాజ్‌గిరి పరిధిలో రహదారుల మధ్య సంవత్సరాలుగా మూలకు పడి తుప్పు పట్టిన వాహనాలపై అధికారులు చర్యలు చేపట్టారు. కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రత్యేక ఆదేశాల మేరకు మల్కాజ్‌గిరి జోన్‌లో 39, ఉప్పల్ జోన్‌లో 40, ఎల్బీనగర్ జోన్‌లో 10 వాహనాలను తొలగించారు. మొత్తం 89 వాహనాలు స్వాధీనం చేసుకుని ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా మార్గాలను స్వచ్ఛంగా మార్చారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26, 2026న ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘సఖా సప్తపద భవ’ అనే వేద మంత్రం స్ఫూర్తితో ఈ జంట జీవితాంతం స్నేహితులుగా కలిసి ఉండాలని ఆకాంక్షించారు. సినిమాల్లో వీరి కెమిస్ట్రీ కంటే, నిజ జీవితంలో దైవం రాసిన ఈ ప్రేమ కథ మరింత అందంగా ఉండాలని ప్రధాని తన సందేశంలో ఆశీర్వదించారు.
WGL: గీసుగొండ మండలం సూర్య తండా సమీపంలోని SRSP కాలువ నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నారని సమాచారం మేరకు గీసుగొండ CI విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో అనుమతులు లేకుండా మట్టి తవ్వి తరలిస్తున్న ఒక జేసీబీ, మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు CI తెలిపారు. వారందరి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు CI వెల్లడించారు.
ప్రకాశం: మార్కాపురం జిల్లా నూతన ఆర్డీవోగా ప్రభాకర్ నియమితులయ్యారు. ఈయన గుంటూరు జిల్లా నుంచి బదిలీపై రానున్నారు. ఇప్పటివరకు మార్కాపురం ఇన్చార్జి సబ్ కలెక్టర్‌గా పని చేసిన వెంకట శివరాంరెడ్డి వెలుగొండ ప్రాజెక్టుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా వెళ్లనున్నారు. అధికారుల ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం ఆర్డీవో బాధ్యతలు స్వీకరించనున్నారు.
T20 WCలో సూపర్-8లో భాగంగా ఇవాళ శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. శ్రీలంక సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సిందే. కాస్త తడబడతున్న శ్రీలంక జట్టు న్యూజిలాండ్ స్పిన్నర్ల ధాటికి తట్టుకుని నిలబడుతందా? అనేది వేచి చూడాలి. అలాగే వర్షం కారణంగా పాక్‌తో మ్యాచ్ రద్దయ్యి ఒక పాయింట్‌తో ఉన్న న్యూజిలాండ్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకమే.
VSP: సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో బుధవారం సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తుల, గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో కమనీయంగా జరిపించారు.
KMR: మద్నూర్ మండలంలో వెంటనే శేనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మండలంలో 8,500 ఎకరాల్లో సాగైన పంట ప్రస్తుతం చేతికి రావడంతో ఆరబెడుతున్నారు. అకాల వర్షాల భయం వెంటాడుతోందని, పంట నష్టపోకముందే ప్రభుత్వం స్పందించి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని కోరుతున్నారు. ఆలస్యమైతే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.
హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తోన్న మూవీ ‘భోగి’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో శర్వానంద్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ మూవీ ఆగస్టు 28న రిలీజ్ కానుంది.
SDPT: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారిని పట్నా హైకోర్ట్ న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి బుధవారం దర్శించుకున్నారు. ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘనస్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహదేవుని మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.
ASF: కెరమెరి మండలంలోని 31 గ్రామాల్లో 623 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, గృహాలతో పాటు తప్పనిసరిగా టాయిలెట్లు నిర్మించుకోవాలని MPDO సురేశ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. బహిరంగ మలవిసర్జన నిర్మూలనలో భాగంగా ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన లబ్దిదారులు పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
ATP: జిల్లాలోని 15 ఏపీ మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఐదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 24 నుంచి మార్చి 31 వరకు apms.apcfss.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీలు రూ.125 ఫీజు చెల్లించాలని అధికారులు కోరారు.
PPM: అకాల వర్షం కారణంగా సాలూరు మండలం కొత్తవలస, మరిపల్లి, కందులపదం, కురుకుట్టి, మమడిపల్లి, తదితర రైతు సేవాకేంద్రాల పరిధిలోని గ్రామాల్లో మొక్కజొన్న పంట నష్టానికి గురి అయిందని మండల వ్యవసాయ అధికారి శిరీష తెలిపారు. పై గ్రామాల్లో సుమారు 45 మంది రైతులకు సంబంధించి 60 ఎకరాల పంట అకాల వర్షానికి దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు.
‘ఛాంపియన్’ ఫేమ్ రోషన్.. దర్శకుడు శైలేష్ కొలనుతో ‘ఏమో ఏమో ఇది’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో రోషన్ మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు సమాచారం. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఇంద్రగంటి శైలిలో టిపికల్ లవ్‌స్టోరీ కథాంశంతో రాబోతున్నట్లు టాక్. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.