MBNR: దేవరకద్ర మున్సిపల్ కేంద్రంలోని జామా మజీద్‌లో మైనారిటీ నాయకులు షీరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని, నెల రోజులపాటు కఠిన నియమాలతో అల్లాను ప్రార్థించే ముస్లింల భక్తి విశేషమని పేర్కొన్నారు.
ATP: జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సర బోటనీ, హిస్టరీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. జనరల్ విభాగంలో 945 మందికి 861 మంది హాజరుకాగా, 84 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 2,255 మందికి 2,124 మంది హాజరుకాగా, 131 మంది పరీక్షకు రాలేదని పర్యవేక్షణాధికారి ఎం.వెంకటరమణ నాయక్ తెలిపారు.
NLG: డిండి మండలంలోని ఎర్రగుంటపల్లి, వావిల్ కోల్, రామంతాపూర్, కందుకూరు, సింగరాజు పల్లి, శకృ తండా, తవక్లాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే బాలు నాయక్ రేపు ఉదయం 9 గంటల నుంచి పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు చెరుకుపల్లిలో అడపాల పర్వత్ రెడ్డి ద్వాదశదిన కర్మలో పాల్గొననున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 159/7 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు సీఫెర్ట్ (35), అలెన్ (29) తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఫిలిప్స్ (39) మినహా మిగిలిన వారంతా విఫలమయ్యారు. దీంతో కివీస్ భారీ స్కోరు సాధించలేకపోయింది. బౌలర్లలో జాక్స్, అహ్మద్, రషీద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
BDK: దమ్మపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే జారి ఆదినారాయణ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా ఆర్లపెంట గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించారు. స్వయం సహాయక సంఘం మహిళా కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాలు గడపగడపకు చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు.
జగిత్యాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాలలో మట్టి కుండలు, గణేష్ విగ్రహాల తయారీపై వర్క్షాప్ నిర్వహించారు. మట్టి పాత్రలు ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు చేస్తాయని జిల్లా విద్యాధికారి కే. రాము తెలిపారు. లింగంపేటకు చెందిన కుమ్మరి మహిపాల్ విద్యార్థులకు సారెతో కుండల తయారీ ప్రదర్శించారు.
HYD: బీసీలలో ఐక్యత పెంపొందించి సమాజాన్ని ముందుకు నడిపించాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిరాహార దీక్ష జరిగింది. బడ్జెట్లో బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని వక్తలు కోరారు. పలువురు ప్రజా ప్రతినిధులు మద్దతు తెలిపారు.
VSP: రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేయాలని రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. గంజాయి వ్యాప్తి యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసారు.
KDP: దువ్వూరులో శుక్రవారం జిల్లా విజిలెన్స్ అధికారులు భారీగా గుట్కాను పట్టుకున్నారు. హైదరాబాదు నుంచి ప్రొద్దుటూరుకు లారీలో గుట్కా రవాణా అవుతుండగా దువ్వూరులో పట్టుకున్నారు. 5 గుట్కా బండిల్లు పట్టుకుని, రూ.1.50 లక్షలు పెనాల్టీ విధించారు. జీరోలో రవాణా అవుతున్న ఇతర వస్తువులకు మరో రూ.1.65 లక్షలు పన్ను విధించారు.
SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులపై కమిషనర్ టి.రవి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. నీటి సరఫరా షెడ్యూల్, మోటార్ల పనితీరు, నిల్వ ట్యాంకుల శుభ్రత పై చర్చించారు. వేసవి కాలం దృష్ట్యా నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పనుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.
VZM: శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శనివారం ఉదయం 7 గంటలకు జామి మండలం జడ్డేటివలస గ్రామం మరియు 8 గంటలకు జామి గ్రామంలో NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం చీపురుపల్లి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పాల్గొనే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం వారు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
EG: శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతల ప్రవర్తనను ఖండిస్తూ రేపు ఉదయం10గంటలకు ఓబీసీ మోర్చాజిల్లా అధ్యక్షుడు మురుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టనున్నారు. గోకవరం బస్టాండ్ సెంటర్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహాం నుండి కంబాల చెరువు దండి మార్చ్ సెంటర్ వరకు ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.
KMM: సత్తుపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు సకాలంలో అందడమే లక్ష్యంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి శుక్రవారం అధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని అన్నారు.
కన్నడ స్టార్ హీరో యష్ కథానాయకుడిగా, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ రూపొందిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’. ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్ సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో అప్‌డేట్ ఇచ్చారు. మార్చి 2న ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
AP: మాజీమంత్రి బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. బొత్స అస్వస్థతకు గురయ్యారని తెలిసి ఆయన బాధపడినట్లు చెప్పారు. బొత్సకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అందించాలని భగవంతుడిని ప్రార్థించారు.