KMM: ఇటీవల అనారోగ్యానికి గురై ఖమ్మం నగరంలోని స్థంభాద్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ వ్యాపారవేత్త ఆకుల భాస్కర్ రావును రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శనివారం పరామర్శించారు. ఆయనకు అందుతున్న చికిత్స గురించి ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అలాగే అక్కడే చికిత్స పొందుతున్న హరి ప్రసాద్‌ను కూడా పరామర్శించారు.
TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్‌హౌజ్ డ్రగ్స్ కేసులో పోలీస్ కస్టడీ ముగిసింది. ముగ్గురు నిందితులకు రెండోసారి మూడు రోజుల కస్టడీ ముగియడంతో నిందితులను పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపర్చారు. సిట్ సేకరించిన ఈ కీలక సమాచారంతో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
MDK: రామాయంపేట మున్సిపాలిటీ 11, 12వ వార్డులో నెలకొన్న ముంపు ప్రాంత ప్రజల సమస్య శాశ్వత పరిష్కారానికి మున్సిపల్ పాలకవర్గం చర్యలు చేపట్టారు. అక్కల బస్తిలోని లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజ్ నిర్మాణం సరింగా లేకపోవడంతో నూతన డ్రైనేజ్ నిర్మాణానికి పనులు ప్రారంభించారు. ఎంతోకాలంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో శాశ్వత పరిష్కారం చేపడుతున్నారు.
NLG: నార్కట్‌పల్లి శివారులో రైలు కింద పడి కొండకింది హరీష్ రెడ్డి (28) అనే యువకుడు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చిట్యాల మండలం ఎలికట్టెకు చెందినవాడు. ఉన్నత చదువులు చదివినా ఆశించిన ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
KRNL: వైసీపీ నాయకులు, మాజీ సీఎం జగన్‌పై, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి వైసీపీ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. ‘MAVIGUN’ అని మరో డ్రామాకు తెరలేపరని విమర్శించారు. జగన్‌కు పిచ్చి ముదిరి పరాకాష్టకు చేరిందని, ఆయనను వీలైనంత త్వరగా పిచ్చాసుపత్రికి తరలించాలని వ్యాఖ్యానించారు.
ఆది సాయికుమార్ తన తదుపరి చిత్రాన్ని ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో అధికారికంగా ప్రారంభించాడు. ‘శంభాల’ సక్సెస్ తర్వాత వస్తున్న ఈ మూవీలో బాంధవి శ్రీధర్ హీరోయిన్. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇవాళ పూజా కార్యక్రమాలతో మొదలైంది. హిందూ-ముస్లిం ప్రేమకథగా, కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.
ELR: టీడీపీ దేవస్థానం చైర్మనుగా BR నాయుడిని ఇంకా కొనసాగించడాన్ని చింతలపూడి నియోజకవర్గ YCP నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా శనివారం కూటమి ప్రభుత్వానికి బుద్ది దయచేయాలని వెంటనే BR నాయుడిని ఆ పదవి నుంచి తొలగించాలని చింతలపూడిలో వెలమపేటలో గల రామాలయం దగ్గర పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ కంభం విజయరాజు పాల్గొన్నారు.
NDL: నందికొట్కూరు మండలం అల్లూరులో ‘మన ఆస్తి–మన హక్కు’ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య, మాండ్ర శివానందరెడ్డి పాల్గొని 630 మంది రైతులకు రాజముద్రతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.
NZB: జిల్లా కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన ఒక సామాజిక వర్గానికి చెందిన కీలక నేత పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తగిన గుర్తింపు, పదవులు దక్కలేదని అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పార్టీ కోసం మొదటి నుంచీ కష్టపడినా, పదవుల పంపకంలో అన్యాయం జరిగిందని భావిస్తున్నారు.
VZM: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బిఆర్ నాయుడును తొలగించేలా ఆలోచన ప్రభుత్వానికి కలిగించాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నాలుగు రోడ్ల జంక్షన్ నుంచి బజారు జంక్షన్ వద్ద గల శ్రీనివాస ఆలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
సత్యసాయి: మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు వ్యక్తిగత సహాయకుడు రవికుమార్ తండ్రి అంజినప్ప మృతి పట్ల మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సంతాపం వ్యక్తం చేశారు. మడకశిర పట్టణం మారుతీ నగర్‌లోని వారి స్వగృహానికి చేరుకుని అంజినప్ప పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
BDK: అశ్వాపురం మండల పరిధిలో మల్లెలమడుగు గ్రామ పంచాయతీలో సుమారు 25 లక్షలతో నిర్మితమవుతున్న బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శనివారం సర్పంచ్ నరసింహారావు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ధన్యవాదాలు తెలిపారు. గత కొన్నిళ్ళుగా బ్రిడ్జి లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని సమస్య తెలిపిన వెంటనే ఎమ్మెల్యే నిధులు మంజూరు చేశారని తెలిపారు.
MNCL: ప్రజాస్వామ్యాన్ని క్యాతనపల్లి కౌన్సిలర్లు కాపాడారని MLA గంగుల కమలాకర్ అన్నారు. మంత్రి వివేక్ ప్రజాస్వామ్యన్ని కాపాడాలని, ప్రజల తీర్పును గౌరవించాలని సూచించారు. పోలీసులను పెట్టి అడ్డుకుంటే సహించమని హెచ్చరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా మంత్రి వివేక్ చూడాలన్నారు. నేడు బీఆర్‌ఎస్ డే అని, క్యాతనపల్లి మున్సిపాలిటీ గెలుచుకుంటామని కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు.
SRCL: సెస్ లైసెన్స్ ముగియడంతో ఎన్పీడీసీఎల్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. దీంతో ఎన్పీడీసీఎల్ అధికారులు వినియోగదారులకు చేరువయ్యే దిశగా చర్యలు చేపట్టారు. ఎన్పీడీసీఎల్ అధీనంలోకి వెళ్లిన మూడు రోజుల్లోనే రూ.10 కోట్ల విలువైన సామగ్రి పెద్దూర్లోని సెస్ స్టోర్ రూమ్‌కు చేరుకుంది. 110 ట్రాన్స్ ఫార్మర్లతో పాటు సామగ్రి, సిబ్బంది రక్షణకు అవసరమైన కిట్లను అందుబాటులో ఉంచారు.