• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మంత్రి నివాసం వద్ద టీడీపీ శ్రేణుల సంభరాలు

VZM: అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంటు ఉభయసభలలో బిల్లు ఆమోదం పొందడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు హర్దాతిరేకాలు వ్యక్తం చేశారు.ఈ మేరకు శనివారం రాత్రి గజపతినగరంలోని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ నివాసం వద్ద కొవ్వొత్తులతో దీపాలు వెలిగించి ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన టీడీపి నాయకులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.

April 5, 2026 / 07:10 AM IST

గాలివీడు పీహెచ్సీ డాక్టర్ మహ్మద్ రఫీ సస్పెండ్

అన్నమయ్య: గాలివీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులకు హాజరు కాకుండా గైర్హాజరు అయిన డాక్టర్ రఫీని డీఎంహెచ్ సస్పెండ్ చేశారు. ఇటీవల కలెక్టర్ నిశాంత్ తనిఖీలో ఆయన ఆస్పత్రిలో లేకపోవడం, అటెండెన్స్‌లో సంతకం చేసి వెళ్లిపోవడం గుర్తించారు. ఈ నేపథ్యంలో విచారణ అనంతరం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయగా, విధుల్లో నిర్లక్ష్యం చూపిన ఉద్యోగి మనోజ్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

April 5, 2026 / 07:10 AM IST

గెలుపే లక్ష్యం: దద్దాల పిలుపు

ప్రకాశం: కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ పార్టీ శ్రేణులకు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎస్ పురంలో జరిగిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో పాల్గొని, ఐక్యతతో క్షేత్రస్థాయిలో చురుకుగా ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని అన్నారు.

April 5, 2026 / 07:09 AM IST

కొలిమిగుండ్ల సీఐ కీలక హెచ్చరిక

NDL: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొలిమిగుండ్ల సీఐ రమేశ్ బాబు ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఆన్లైన్, ఆఫ్-లైన్ బెట్టింగ్లపై నిఘా ఉంచామని తెలిపారు. బెట్టింగ్ వలలో చిక్కుకుని లక్షలాది రూపాయలు అప్పులు చేసి, ఎంతో మంది యువత ప్రాణాలు కోల్పోయిన ఘటనలను గుర్తుచేశారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

April 5, 2026 / 07:09 AM IST

గుంటూరు అభివృద్ధికి ప్రణాళికాబద్ధ నిధులు: మంత్రి

GNTR: జిల్లా సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన బడ్జెట్ అవుట్‌రీచ్ ఈవెంట్-2026-27లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి అవసరాల మేరకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

April 5, 2026 / 07:06 AM IST

‘విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులు అనుమతి లేదు’

AP: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించకూడదనే నిబంధనను అమలు చేయాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. దీనిపై గతంలో దేవదాయశాఖ, శృంగేరి శారదా పీఠం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని చెప్పింది. విదేశాలకు వెళ్లిన వారు సంప్రదాయాలకు విరుద్ధంగా జుట్టు కత్తిరించుకున్నారని, వారు గర్భాలయాల్లోకి వెళ్లకూడదన్న నిబంధన అమలు కావడం లేదని ఓ అర్చకుడు పిటిషన్ వేశారు.

April 5, 2026 / 07:05 AM IST

మౌనిక హత్య’పై నిరసనలు

VSP: గాజువాకలో ఇటీవలే నేవీ ఉద్యోగి రవీంద్ర చేతిలో దారుణహత్యకు గురైన మౌనిక హత్య కేసును జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలని శనివారం పెద్దఎత్తున మహిళ సంఘాలు, దళిత ప్రజాసంఘాలు నిరసన చేపట్టారు. దోషులను కఠినంగా శిక్షించాలంటే జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిపి, మౌనికకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

April 5, 2026 / 07:02 AM IST

హిరమండలం ఎస్సై హేమంత్ కల్యాణ్ ఆకస్మిక బదిలీ

SKLM: జిల్లాలోని హిరమండలం పోలీసు స్టేషన్ Si గా పని చేస్తున్న హేమంత్ కల్యాణ్ ను ఆకస్మికంగా బదిలీ చేశారు. శనివారం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసు స్టేషన్ కు అటాచ్మెంట్ చేశారు . ఆయన స్థానంలో రెండో పట్టణ ఎస్సై మధుసూదన రావును హిరమండలం స్టేషన్ కు బదిలీ చేశారు. బదిలీకి గల కారణాలు తెలియాల్సి ఉంది

April 5, 2026 / 07:02 AM IST

నేడు ఇల్లందకుంట రాములవారికి శ్రీ పుష్పయాగం

KNR: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు శ్రీపుష్పయాగం సందర్భంగా స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ ఛైర్మన్ రామారావు, ఈవో సుధాకర్, ధర్మకర్తలు తెలిపారు. భక్తులకు విద్యుత్, నీటి వనరులను కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు.

April 5, 2026 / 07:01 AM IST

న్యాయం గెలిచింది.. అమరావతి నిలిచింది

ELR: అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుపై హర్షం వ్యక్తం చేస్తూ పోలవరం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బొరగం శ్రీనివాసులు శనివారం రాత్రి దీపోత్సవం నిర్వహించారు. తన నివాసం వద్ద దీపాలు వెలిగించి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. న్యాయం గెలిచిందని, అమరావతి నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి కోసం ప్రజలందరి ఆకాంక్ష అన్నారు.

April 5, 2026 / 07:00 AM IST

సంస్కృతి కళాశాలలో ఐడీఈ బూట్ క్యాంప్

సత్యసాయి: పుట్టపర్తి సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో ఏప్రిల్ 6 – 10 వరకు ఇన్నోవేషన్ బూట్ క్యాంప్ నిర్వహించనున్నారు. కేంద్ర టెక్నికల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నూతన ఆవిష్కరణలు, డిజైనింగ్ మెలుకువలు, వ్యాపార అవకాశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు హాజరుకానున్నారని సంస్థ నిర్వాహకులు తెలిపారు.

April 5, 2026 / 07:00 AM IST

బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

ADB: ఈ నెల 6న బజరహత్నూర్ మండలం పిప్పిరీ గ్రామంలో CM పర్యటన సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షి షా, SP అఖిల్ మహజాన్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభ ప్రాంగణం, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.

April 5, 2026 / 07:00 AM IST

మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన రాఘవేంద్ర రెడ్డి

KRNL: టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి శనివారం మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. కర్ణాటక రాష్ట్రం సిందనూరు తాలూకాలో సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవం, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కాంస్య విగ్ర ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను రాఘవేంద్ర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

April 5, 2026 / 07:00 AM IST

అమరావతికి ఎమ్మెల్యే శ్రావణి దీపహారతి

ATP. రాష్ట్ర రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత లభించడంపై ఎమ్మెల్యే బండారు శ్రావణి హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ కూటమి నేతలతో కలిసి ఆమె దీపాలు వెలిగించి వేడుకలు జరిపారు. ఇది ప్రజా ప్రభుత్వం సాధించిన విజయం అని కొనియాడారు. రాజధానిపై వైసీపీ నేతలు విషం కక్కడం మానాలని హితవు పలికారు.

April 5, 2026 / 06:59 AM IST

గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి

ప్రకాశం: దోర్నాల మండలం జమ్మి దోర్నాల క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. మృతుడిది దోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామానికి చెందిన ఒంటేరు ఆవులయ్యగా గుర్తించారు. మృతుడు మతిస్థిమితంలేక తిరుగుతుంటాడని సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

April 5, 2026 / 06:58 AM IST