• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ముస్లిం సోదరులకు స్వీట్లు పంపిణీ చేసిన సర్పంచ్

RR: యాచారం మండలం నంది వనపర్తి గ్రామంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని సర్పంచ్ రాయికంటి విజయ్ కుమార్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన స్వయంగా స్వీట్లు పంపిణీ చేసి, అన్ని మతాల ప్రజలు ఐక్యంగా ఉండాలని సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో కారొబార్ మహేందర్, బీజేపీ నాయకులు సాయి కుమార్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

March 21, 2026 / 01:15 PM IST

పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలి: ఎంపీ

ATP: అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ శనివారం అశోక్ నగర్ ఈద్గాలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ముస్లిం మత పెద్దలు, సోదరులను కలిసి ఆప్యాయంగా పలకరించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

March 21, 2026 / 01:13 PM IST

జగన్ వేల కోట్లు దోచుకున్నారు: సోమిరెడ్డి

TG: తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.వేల కోట్లు దోచుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఆస్తుల పంపకంలో చెల్లికి అన్యాయం చేశారని మండిపడ్డారు. సొంత పత్రికలో తల్లికి వ్యతిరేకంగా రాయించే సుపుత్రుడు జగన్ అని ఎద్దేవా చేశారు.

March 21, 2026 / 01:13 PM IST

టోర్నమెంట్ విజేతలకు ట్రోఫీ అందించిన ఎమ్మెల్యే

E.G: రాజమండ్రిలో నిర్వహించిన ABD ఛాంపియన్‌షిఫ్ టోర్నమెంట్‌లోని విజేతలకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శనివారం ట్రోఫీలను అందచేశారు. స్థానిక నెహ్రు నగర్‌లో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులతో కలిసి విజేతలకు ఆ ట్రోఫీలను అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు పాల్గొన్నారు.

March 21, 2026 / 01:11 PM IST

GHMC ముఖ్య నేతలతో బీజేపీ కీలక భేటీ

TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు GHMC ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలపై సన్నద్ధత, పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ రఘునందర్ రావు తదితరులు హాజరయ్యారు. కాగా, త్వరలో ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

March 21, 2026 / 01:11 PM IST

రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు

NRPT: మరికల్ ఈద్గా మైదానంలో శనివారం రంజాన్ ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ముస్లిం సోదరులు భారీగా పాల్గొన్నారు.

March 21, 2026 / 01:11 PM IST

రంజాన్ వేడుకల్లో మార్కాపురం ఎమ్మెల్యే

మార్కాపురం పట్టణంలో రంజాన్ పండగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఈద్గాల వద్ద వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, శాంతి, ఆప్యాయతతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

March 21, 2026 / 01:10 PM IST

అవనిగడ్డలో ఘనంగా ఈదుల్ ఫితర్ ప్రత్యేక ప్రార్ధనలు

కృష్ణా: అవనిగడ్డలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని ఈద్గా మైదానంలో ఖురాన్ గురువుతో కలిసి ఈదుల్ ఫితర్ ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం దానధర్మాలు చేశారు. ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, జనసేన జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు.

March 21, 2026 / 01:10 PM IST

పబ్లిక్ గార్డెన్ సేంద్రీయ ఉత్పత్తుల సంత

HNK: హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నేరెళ్ల వేణుమాధవ్ ప్రాంగణంలో గ్రామీణ ప్రకృతి ఉత్పత్తుల సంతను నిర్వహించారు. స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ ప్రాంత సంపర్‌కు ప్రముఖ్ రవీందర్, సేంద్రియ వ్యవసాయ ప్రముఖ్ రామ్ రెడ్డి సంతను ప్రారంభించారు. సంతను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని, సంతలో సేంద్రియ ఉత్పత్తులు, గో-ఆదారిత ఉత్పత్తులు లభిస్తాయన్నారు.

March 21, 2026 / 01:10 PM IST

బొల్లారంలో ఘనంగా రంజాన్ వేడుకలు

SRD: బొల్లారం మున్సిపాలిటీలో రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాహ్ వద్ద ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ సందర్భంగా శాంతి, సామరస్య వాతావరణంలో పండుగను జరుపుకోవాలని వారు సూచించారు. ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

March 21, 2026 / 01:10 PM IST

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: అటవీ అధికారులు

BDK: ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఇవాళ అడవి శాఖ అధికారులు మణుగూరు నుంచి అశ్వాపురం మీదగా భద్రాచలం క్రాస్ రోడ్డు వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అటవీ శాఖ అధికారులు పిలుపునిచ్చారు. మొక్కల వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని ప్రసాదించవచ్చని అన్నారు.

March 21, 2026 / 01:06 PM IST

వాట్సాప్ కొత్త ఫీచర్: చదవగానే MSG మాయం

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీని పెంచేందుకు ‘ఆఫ్టర్ రీడింగ్’ అనే కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా పంపిన మెసేజ్, అవతలి వ్యక్తి చదివిన వెంటనే ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. ప్రస్తుతం బీటా దశలో ఉన్న ఈ ఆప్షన్ వల్ల సీక్రెట్ మెసేజ్‌లకు మరింత భద్రత లభిస్తుంది. పాత డిసపియరింగ్ ఫీచర్ లాగా సమయంతో సంబంధం లేకుండా, చదవడమే ఆలస్యం మెసేజ్ మాయమవుతుంది.

March 21, 2026 / 01:06 PM IST

కోసిగిలో భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు

KRNL: కోసిగిలో ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ వేడుకలను శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైసీపీ జిల్లా కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి హాజరై, ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని, సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.

March 21, 2026 / 01:05 PM IST

గౌరవానికి ప్రతీకగా నిలిచిన దృశ్యం

RR: రంజాన్ పండుగ సందర్భంగా ఫరూఖ్ నగర్ మండలం పీర్లగూడ గ్రామంలో ఆప్యాయ వాతావరణం నెలకొంది. గ్రామ సర్పంచ్ షమీమ్ బేగంను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో సైతం మమకమై పండుగ వాతావరణం పంచుకున్నారు. ఈ సందర్శన గ్రామ ప్రజల్లో ఆనందాన్ని నింపగా, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రజలు కొనియాడారు.

March 21, 2026 / 01:04 PM IST

రాయచోటిలో రంజాన్ సందడి

అన్నమయ్య: రాయచోటి గాలివీడు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు మైనారిటీ నాయకుడు సుగవాసి ప్రసాద్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. మిఠాయిలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మైనారిటీల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

March 21, 2026 / 01:03 PM IST