SDPT: జగదేవపూర్ మండల కేంద్రంలో బోళ్ల కనకమ్మ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం సర్పంచ్ పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ గుమ్మడికాయ కొట్టి ఇంటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మచ్చ గణేష్, వివిధ వార్డుల సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
BHNG: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సతీమణి శ్రీనిత శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమెతోపాటు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
అన్నమయ్య: మదనపల్లెలోని ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఉన్న పాత బోర్డు పూర్తిగా జీర్ణావస్థకు చేరింది. తుప్పు పట్టి ప్రమాదకరంగా మారినా, ఇప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం ప్రజల్లో అసంతృప్తి కలిగిస్తోంది. ఎప్పటికైనా ఈ బోర్డును తొలగించి కొత్తదాన్ని ఏర్పాటు చేస్తారా అన్న ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది.
MBNR: దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిని శుక్రవారం కలెక్టర్ ఖుష్భూ గుప్తా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్ధిదారులకు అందుతున్న వసతులు, పెండింగ్ పనులపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ యుగంధర్ రెడ్డి, కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
AP: YS మరణం వరకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని YS విజయలక్ష్మీ అన్నారు. ఆస్తుల పంపకం ఎప్పుడు జరగలేదని.. ఆస్తులు నలుగురు మనుమలకు సమానంగా పంచాలని వైఎస్ ఉద్దేశ్యమన్నారు. YS దగ్గర వాళ్లందరికీ తెలిసిన వాస్తవమిదని తెలిపారు. MOUలో రాసిన ప్రతి ఆస్తి షర్మిలకు చెందాల్సినవేనని వెల్లడించారు. ఆస్తుల విషయంలో జగన్.. తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశాడని ఆరోపించారు.
TG: భట్టి బడ్జెట్ బోగస్ బడ్జెట్.. జూటా బడ్జెట్ అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బడ్జెట్ ద్వారా ఆరు గ్యారెంటీలకు సమాధి కట్టారన్నారు. ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. గతంలో నిధులు ఖర్చు చేయని పథకాలకు మళ్లీ నిధులు కేటాయించారన్నారు. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు అసలు నిధులే కేటాయించలేదన్నారు.
WNP: నిరుద్యోగ యువత, తమ స్వయం ఉపాధిని సొంతంగా కల్పించుకుని ఇతరులకు కూడా ఉపాధిని కల్పించాలని శ్రీరంగాపూర్ మండల ఎస్సై హిమబిందు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో స్వయం ఉపాధిలో భాగంగా నాగరాజు ఫ్లెక్సీ ప్రింటింగ్ యూనిట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మద్దిలేటి, రాజేంద్రప్రసాద్, మాలిక్, అందెల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
TG: ఈ బడ్జెట్‌లో తులం బంగారానికి నిధులు కేటాయిస్తారని ఆడబిడ్డలు ఆశించారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బడ్జెట్‌లో బీసీలకు ఘోరమైన అన్యాయం చేశారని మండిపడ్డారు. బీసీల గొంతు కోశారని.. బీసీలకు బడ్జెట్‌లో కోత పెట్టారన్నారు. ఆయా వర్గాల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఆత్మగౌరవ భవనాలకు నిధులు కేటాయించలేదన్నారు.
NZB: రాష్ట్రంలో 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల కోసం నేటి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.500 కోట్లను ప్రతిపాదించారు. ఈ నిధులతో NZB జిల్లాలోని కందకుర్తితో పాటు TGలోని బాసర, ధర్మపురి, కాలేశ్వరం, భద్రాచలం ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పించి కుంభమేళా తరహా పుష్కరాలు జరుపనున్నారు.
ASF: అగ్నివీర్ 2027 రిజిస్ట్రేషన్ ప్రారంభమైనట్లు ఎస్పీ నితికా పంత్ తెలిపారు. దీంతో జిల్లాలో అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జీడీ, మహిళా మిలిటరీ పోలీస్, క్లర్క్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయన్నారు. అభ్యర్థుల అవగాహన కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కళాశాలల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు.
ASR: అడవి బిడ్డల ప్రాణాలతో అటవీ శాఖ అధికారులు చెలగాటమాడొద్దని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతరామారావు శుక్రవారం అన్నారు. 20 రోజులుగా జిల్లాలో ప్రజలను హడలెత్తిస్తున్న పులి కదలికలతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారన్నారు. వన్యప్రాణులు సంరక్షణ పేరుతో ఆదివాసులను భయపెట్టడం తగదన్నారు. హక్కులు, ప్రాణ రక్షణ కోసం సంఘటితం అవుదామన్నారు.
AKP: జిల్లా స్థాయి శాప్ లీగ్స్ అథ్లెటిక్స్(మాస్టర్స్) పోటీలు ఈనెల 24న అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి పి. శైలజ శుక్రవారం తెలిపారు. 35, 45 ఏళ్ల పైబడిన పురుషులు, మహిళలకు వేరువేరుగా పోటీలు జరుగుతాయని అన్నారు. ఈ పోటీల్లో ఎంపికైన వారికి ఈనెల 30, 31వ తేదీల్లో గుంటూరులో రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయన్నారు.
PPM: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆపరేషన్ వజ్రప్రహర్‌లో బాగంగా జీ.ఎల్.పురం మండలం గోపాలపురం గ్రామంలో కార్డెన్ సెర్చ్ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానం ఉన్న ప్రతి ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అక్రమ రవాణా, నేరాల అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
HNK: నర్మెట్ట రైతు ఉత్సవాల కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాజీపేట 62వ డివిజన్ నుంచి రైతులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. కార్పొరేటర్ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. రైతు ఉత్సవాలకు హాజరైన రైతులు పంట సాగు పద్ధతులు, ఆధునిక వ్యవసాయ విధానాలు, కొత్త సాంకేతికతల గురించి తెలుసుకోవాలని, సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.
SRPT: మునగాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత ప్రత్యేక వైద్య శిబిరాన్ని సర్పంచ్ ప్రమీల శ్రీనివాస్ ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ఇవి కీలకమని సర్పంచ్ పేర్కొన్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని మునగాల మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సూచించారు.