RR: అరెస్టులతో బీజేపీ పోరాటాలను ఆపలేరని బీజేపీ కొత్తూరు మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలకు నిరసనగా బీజేపీ చేపట్టిన కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి అరెస్టులకు పాల్పడటం హేయమైన చర్య అన్నారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా అడ్డగించిన కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామన్నారు.
NZB: టీయూ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (APE/PCH) 8, 10 వ సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ ఇవాళ తెలిపారు. ఈ నెల 28 లోపు ఇంటిగ్రేటెడ్ పీజీ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు తమ కళాశాలల్లో పరీక్ష ఫీజులు చెల్లించాలని స్పష్టం చేశారు.
TG: RTCకి రూ.2,500 కోట్లు బకాయిలు పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఉచిత బస్సుతో RTCలాభాల్లోకి వెళ్లిందని చెబుతున్నారని.. లాభాల్లోకి వెళ్తే ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ ఎందుకు ఇస్తాలేరని ప్రశ్నించారు. HYDలోని బస్టాండ్‌లను ప్రైవేట్‌కు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాగితాలు, అంకెల మీద తప్ప ప్రజల కష్టాలు తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
JN: పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 24న మంగళవారం ఉదయం 10:30 గంటలకు హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేవదాయ , ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఆలయంలోని కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రకాశం: మర్రిపూడి మండలం కేజీ కండ్రిక గ్రామంలో గత నెల రోజులుగా గ్రామస్థులు తాగునీరు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ వారు గ్రామంలో కాలువ తీస్తూ పైపులు పగలగొట్టారని కాంట్రాక్టర్ ఆరోపిస్తున్నాడు. పంచాయతీ పదవి బాధ్యతలు ముగుస్తున్నాయని తమకు సంబంధంలేదని పంచాయతీ వారు అంటున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
NLG: కొత్తగా రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా నియమితులైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. వీరేశంతో పాటు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఉన్నారు.
SRD: హత్నూర మండలం పల్పనూర్ శివారులోని మంజీరా నదిలో వేలాది చేపలు మృతి చెంది పైకి తేలడం స్థానికంగా కలకలం రేపింది. కలుషిత జలాల వల్లే చేపలు చనిపోయాయని, దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కోరారు.
నంద్యాల కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్నతో పాటు సంబంధిత శాఖల అధికారులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నగర అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు ప్రజల సమస్యలను సమయానుకూలంగా పరిష్కరించాలన్నారు.
TPT: పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కెరీర్ కౌన్సిలింగ్- వ్యక్తిత్వ వికాస సదస్సులో ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రమౌళి మాట్లాడుతూ.. విద్యార్థులు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అతిథులు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, మత్తు పదార్థాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అనన్య పాండే నటించిన కాల్ మీ బే మొదటి సీజన్ హిట్ కావడంతో, అమెజాన్ ప్రైమ్ రెండో సీజన్‌ను సిద్ధం చేస్తోంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టులోకి స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చేరినట్లు వార్తలు వస్తున్నాయి. మరింత డ్రామా, కామెడీ, ఊహించని మలుపులతో రానున్న ఈ కొత్త సీజన్‌పై శృతి రాకతో అంచనాలు భారీగా పెరిగాయి. ఆమె ఇందులో ఒక కీలక పాత్రలో మెరవనుందని సమాచారం.
W.G: తాడేపల్లిగూడెంకు చెందిన తమ్మారెడ్డి రామ్ సిద్ధార్థ ఇటీవల విడుదలైన గేట్ పరీక్షలో ECE విభాగంలో 128వ ర్యాంకు సాధించారు. జాతీయ స్థాయిలో జరిగిన ఈ ప్రవేశ పరీక్షలో 128వ ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు శ్రీనివాస్ బాబు, పద్మలత హర్షం వ్యక్తం చేశారు. తండ్రి శ్రీనివాసబాబు RWSDEగా పనిచేస్తున్నారు.
CTR: యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి తెలిపారు. విద్యా, పోలీస్ శాఖల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పారు. 20 నెలల్లో 6 లక్షలకుపైగా ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు భరోసా అని ఆయన పేర్కొన్నారు.
MHBD: నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు గ్రామ మాజీ సర్పంచ్ కొలగాని నాగరాజు తండ్రి రిటైర్డ్ టీచర్ కొలగాని రాజయ్య ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత శుక్రవారం వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
TG: గోదావరిలో ఐదుగురు గల్లంతవ్వడం అత్యంత విషాదకరమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతదేహాల వెలికితీత చర్యలు వేగవంతం చేయాలని యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు. కాగా, పోలవరం జిల్లా ఏటపాక మండలం కూనవరం వద్ద భద్రాచలానికి చెందిన ఏడుగురు స్నానం కోసం నదిలోకి దిగగా.. ఐదుగురు గల్లంతయ్యారు.
ELR: ఇంటి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు అన్నారు. శుక్రవారం ఉంగుటూరు(మం) నారాయణపురంలో పంచాయతీ ఆధ్వర్యంలో ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూళ్లను ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారి విజయకుమార్, గుమస్తా స్వరూప పాల్గొన్నారు.