థాయ్‌లాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఇటీవల భూకంపంలో మృతి చెందిన వారికి భారత్ తరఫున సంతాపాన్ని ప్రకటించారు. భారత్, థాయ్‌లాండ్ మధ్య శతాబ్దాల అనుబంధం ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా రామాయణ కుడ్య చిత్రాల ఆధారంగా స్టాంప్‌ను విడుదల చేయడంపై థాయ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆ దేశ ప్రధాని పేటోంగ్ టార్న్ షినవత్రాతో పలు అంశాలపై చర్చించారు.