BHNG: అక్షయ తృతీయ సందర్భంగా వాసవి క్లబ్ భువనగిరి వారి ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయ గోశాలకు, బుస్స ఈశ్వర్, పులిగిల్ల ప్రకాష్ ఆర్థిక సహాయంతో ఒక ట్రాక్టర్ గడ్డి, రెండు బస్తాల దాణా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బిజ్జాల మహేశ్, కోశాధికారి జంగాల హనుమంతరావు, జోన్ ఛైర్మన్ ఆకుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.