NLG: గుండ్లపల్లి(డిండి) మండలం బ్రాహ్మణపల్లి గ్రామ సమీపంలో వ్యవసాయ పొలం వద్ద బుధవారం సాయంత్రం పిడుగు పడి రెండు ఎడ్లు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. జబ్బు పెద్దయ్యకు చెందిన రెండు ఎడ్లు మృతి చెందడంతో రైతు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మండలంలో అకాల వర్షానికి పలుచోట్ల పంటలు దెబ్బతిన్నట్లు తెలిపారు.