KMR: జిల్లాలో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 47 శాతం మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. రామారెడ్డిలో గురువారం సన్నం బియ్యం పంపిణీ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సన్నం బియ్యం నాణ్యత, తూకంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూస్తామని తెలిపారు.