VZM: వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి చెక్కులను రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ శనివారం అందజేశారు. అనారోగ్యానికి గురై చికిత్స పొందిన గెంబలి విమల కుమారికి రూ. 4,01,137 పెనుబాక గ్రామానికి చెందిన చీడి జగన్నాథానికి రూ. 2,63,124 చెక్కులను అందబేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపదల ఆరోగ్యానికి భరోసాగా సీఎం సహాయనిధి నిలుస్తుందన్నారు.
VZM: గరివిడి మండలం వెదుళ్ల వలస గ్రామంలో భీష్మ ఏకాదశి సందర్బంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా పార్వతీపురం పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు బ్రహ్మశ్రీ కంచు మోజు రామ్మోహన్ రావు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పెనుమత్స సాంబ మూర్తి రాజు ఆధ్వర్యంలో గీత పారాయణం, సత్సంగ ప్రవచనం కార్యక్రమం జరిపారు.
SRPT: లింగ వివక్షత లేని సమాజం కోసం మహిళలు పోరాటం చేయాలని భారత జాతీయ మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన మహిళలకు పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేటలో కౌన్సిల్ సమావేశం దంతాల పద్మ రేఖ అధ్యక్షతన జరిగింది. మహిళలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా మహిళా సమాజాన్ని జాగృతం చేసేవిధంగా ఆర్థికంగా, సామాజికంగా, ఎదిగేందుకు కృషి చేయాలని అన్నారు.
HYD: గోషామహల్ సర్కిల్ పరిధిలో ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డ్రైనేజీ, రోడ్ల సమస్యలు ఉన్నాయని స్థానికులు ఎమ్మెల్సీ దృష్టికి తెచ్చారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్సీ ఆదేశించారు. అలాగే ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు తీసుకుని పరిష్కరించాలని సూచించారు.
SRPT: కోదాడ పట్టణంలో కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను నిరసిస్తూ ఫిబ్రవరి 10న హైదరాబాదులో జరిగే మహాధర్నాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ములకలపల్లి రాములు పిలుపునిచ్చారు. శనివారం కోదాడ పట్టణంలోని సుందరయ్య భవన్‌లో సీపీఎం పట్టణ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
SRPT: కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్. ఖయ్యూం ఇటీవల ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. శనివారం టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బచ్చలకూరి నాగరాజు ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఖయ్యూం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహించారన్నారు.
HYD: కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణ వాడి రామానంద మెమోరియల్ సెంటర్లో కుట్టుపని నేర్చుకున్న మహిళలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుట్టు మిషన్లను అందజేశారు. 40 మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
టీమిండియా మాజీ క్రికెటర్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి రిషభ్ పంత్‌ను దృష్టిలో ఉంచుకోవాలని తొలుత సూచించినట్లు తెలిపాడు. అయితే, ఇప్పుడు అక్షర్ పటేల్ మంచి ఆప్షన్‌గా అనిపిస్తోందని పేర్కొన్నాడు. మిడిలార్డర్‌లో అక్షర్ సరిపోతాడని.. బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంటుందని అన్నాడు. రిషభ్ పంత్‌కు ఛాన్స్‌లు తక్కువేనని చెప్పుకొచ్చాడు.
అన్నమయ్య: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్న కేంద్రాల వద్ద ఆశా కార్యకర్తలకు వేసిన డ్యూటీని ప్రభుత్వం రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి, శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శనివారం మదనపల్లెలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద నిపుణులైన డాక్టర్లను, సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు.
SRPT: ఎస్సారెస్పీ కాల్వ ద్వారా నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి దేశోజు మధు కోరారు. శనివారం నూతనకల్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. యాసంగి సీజన్‌లో వరి నాట్లు వేసిన రైతులకు ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీళ్లు రాకపోవడంతో పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ATP: కళ్యాణదుర్గంలో శ్రీరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రజలను, భక్తులను అలరించేందుకు జబర్దస్త్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఈరోజు రాత్రి జబర్దస్త్ ప్రోగ్రామ్ జరుగుతోంది. జబర్దస్త్ ప్రోగ్రామ్‌కు ఏర్పాట్లను రామస్వామి కమిటీ సభ్యులు దగ్గరుండి చేయిస్తున్నారు. సీఐ యువరాజు, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ రమేశ్, తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.
ASR: గ్రామాల్లో ఆలయాల నిర్మాణాల వల్ల ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెరిగి, శాంతి నెలకొంటుందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పేర్కొన్నారు. హుకుంపేట మండలంలోని కొంతిలి గ్రామంలో శనివారం నిర్వహించిన సీతారాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక పంచాయతీ సర్పంచ్ రేగం రమేశ్‌తో కలిసి ఎమ్మెల్యే విగ్రహ ప్రతిష్ట చేశారు.
AKP: మాఘ పౌర్ణమి జాతర సందర్భంగా రేవు పోలవరంకి ఈనెల 11వ తారీకు మంగళవారం సాయంత్రం నుండి బుధవారం సాయంత్రం వరకు నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుండి 35 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ధీరజ్ తెలిపారు. నర్సీపట్నం నుండి అడ్డు రోడ్డు వరకు 15 బస్సులు, అడ్డరోడ్డు నుండి రేవు పోలవరం వరకు 15 బస్సులు, కర్రీవానిపాలెం నుండి ఐదు బస్సులు ఉంటాయన్నారు.
KDP: జమ్మలమడుగు సబ్ డివిజన్ పరిసర ప్రాంతాలలో వరుస దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇల్లూరి నాగరాజు, బొబ్బిలి వెంకటరమణ, పొన్న తోట జయరాజు అనే ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
SRPT: ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఫిబ్రవరి 27న నిర్వహించబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పిఓ, ఎపీఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తారని తెలిపారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.