KMR: RTC డిపో మేనేజర్ కరుణ శ్రీ గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎంను కలెక్టర్ అభినందించారు. జిల్లా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు ఆర్టీసీ కృషి చేయాలని ఆయన సూచించారు. డీఎం మాట్లాడుతూ.. జిల్లాలో ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరిచేందుకు తమవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.