MBNR: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పెంచినట్టు కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి వార్షికాదాయం 1.5 లక్షలకు మించరాదని, పట్టణ ప్రాంతాల వారికి రెండు లక్షలకు మించరాదని తెలిపారు.