JGL: గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టరిత్య నేరమని మాత శిశు సంరక్షణ జిల్లా అధికారి ముస్కు జైపాల్ రెడ్డి అన్నారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా పట్టణంలోని స్కానింగ్ సెంటర్లను గురువారం తనిఖీ చేశారు. ఈ మేరకు స్కానింగ్ సెంటర్లలోని స్కానింగ్ మిషన్లను, డాక్టర్ల అర్హత ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు.