KMR: కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర 3వ వార్డులో DCC అధ్యక్షులు కైలస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం KMR మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో KMR మండలం షాబ్దీపూర్, క్యాసంపల్లి గ్రామాల్లో జై బాపు, జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర నిర్వహించారు.