NZB: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో CDMA శ్రీదేవి చేతుల మీదుగా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు ప్రశంసా పత్రం అందుకున్నారు. కమిషనర్ రాజు మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను వసూళ్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ ప్రశంసా పత్రం అందజేశారని తెలిపారు.