TPT: చిన్నగొట్టిగల్లు మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు సబ్సిడీ పనిముట్ల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు. 8.48 లక్షల రూపాయల సబ్సిడీ పనిముట్లను రైతులకు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.