W.G: మొగల్తూరులోని లక్ష్మీ హరి ప్రియ HP గ్యాస్ గోడౌనను శుక్రవారం ఆర్టీవో దాసిరాజు, తహసీల్దార్ రాజ్ కిషోర్ తనిఖీ చేశారు. గ్యాస్ సిలిండర్ల నిల్వలను ఆన్‌లైన్ డేటాతో సరిపోల్చి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిబంధనలు పాటించాలని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు.
AKP: ఎస్ రాయవరం మండలం గుడివాడకు చెందిన మల్లపురాజు సత్యనారాయణ రాజుకు సీఎం సహాయ నిధి చెక్కు మంజూరు అయింది. ఈ మేరకు మండల టీడీపీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం, పార్టీ నాయకులు వెంకటరాజు, కోడ లోవరాజు, సుంకర శ్రీనివాసరావు ఇవాళ లబ్ధిదారుడికి రూ.53,284 చెక్కును అందజేశారు. అబద్ధం మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
GDWL: కేటిదొడ్డి మండలం పూజారి తాండ గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ దేవసప్ రాజు నాయక్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ రహదారి నిర్మాణంతో గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గనున్నాయి. గ్రామ అభివృద్ధికి తీసుకున్న ఈ చర్యపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామానికి చెందిన ఆయిళ్ల మల్లేష్(55)శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. మృతుని కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో ఉండి మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చారు. జానహిత సేవా సమితి ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ సిబ్బంది నేత్రాలను సేకరించి ధ్రువీకరణ పత్రం అందజేశారు.
E.G: ఈ నెల 21 శనివారం జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా పడినట్లు మండపేట మండల విద్యా శాఖాధికారి నాయుడు రామచంద్రరావు శుక్రవారం తెలిపారు. రంజాన్ పండుగ సెలవు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని కోరారు. ఏప్రిల్ 2న యథావిధిగా పరీక్ష నిర్వహిస్తామన్నారు.
SRD: సిర్గాపూర్ మండలంలోని పోచాపూర్ గ్రామంలో దుర్గా భవాని మాత జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం స్థానిక కాశీ విశ్వనాథ మందిరం నుంచి రథోత్సవం మొదలైంది. అంతకుముందు గ్రామస్తులు ఆచార సాంప్రదాయం ప్రకారంగా రథం ఎదుట నైవేద్యం భక్షాలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. తొలుత గ్రామ పెద్దలు రథాన్ని లాగి శోభయాత్ర చేపట్టారు
W.G: నరసాపురంలో అక్రమ వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా నాయకుడు కవురు పెద్దిరాజు శుక్రవారం డిమాండ్ చేశారు. బాధితురాలు రమణతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పు తిరిగి చెల్లిస్తామన్నా.. బంగారం ఇవ్వడం లేదని ఆరోపించారు. వడ్డీ వ్యాపారులకు వత్తాసు పలుకుతున్న నరసాపురం రూరల్ CI దుర్గా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
KMR: రాజంపేట మండలం పొందుర్తిలో మహిళా సంఘం భవనానికి భూమిపూజ చేసినట్లు మండల అభివృద్ధి అధికారి బాలకృష్ణ తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా విడుదలైన రూ.10లక్షలతో ఈ భవన నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్ గర్గుల బాబు, ఐకేపీ సీసీ, కమ్యూనిటీ కోఆర్డినేటర్ వివోఏలు పాల్గొన్నారు.
NDL: సంజామల మండలంలోని పలు గ్రామాల్లో ఎస్సార్ బీసీ కాలువలో సాగునీరు వృథాగా పారుతోంది. పదో బ్లాక్ కాలువ వద్ద కృష్ణా జలాలు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం పంటలు నూర్పిడి దశలో ఉండటంతో నీటి అవసరం లేకపోయినా సరఫరా కొనసాగుతుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నీటి వినియోగాన్ని సమర్థంగా నిర్వహించాలని కోరుతున్నారు.
NGKL: కొల్లాపూర్‌కు చెందిన కాంగ్రెస్ నేత రాము యాదవ్‌ను జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా నియమిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. రాము యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు అందరికి అందేలా కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో పదవి అప్పగించిన రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ, నేతలకు ధన్యవాదములు తెలిపారు.
RR: చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కారణంగా ప్రస్తుతం డయాలసిస్ సేవలు నిలిచిపోయాయి. దీంతో డయాలసిస్ రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రికి వద్దకు వచ్చిన రోగులను వికారాబాద్, షాద్‌నగర్ ఆసుపత్రులకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నట్లు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్లలోనే సేవలను అందించాలని రోగులు కోరుతున్నారు.
సత్యసాయి: ఉగాది పరాభవ నామ సంవత్సరం పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నూతన తెలుగు కాల పట్టిక, డైరీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో MLA కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొని డైరీలను విడుదల చేశారు. హిందూ సంప్రదాయాలను, కాల గణనను ప్రజలకు చేరువ చేయడంలో వీహెచ్‌పీ కృషి అభినందనీయమని కొనియాడారు. కార్యకర్తలు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
NLG: తెలంగాణ ప్రభుత్వ విప్‌గా నియమితులైన సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గం ప్రజలకు విప్ హోదాలో మరిన్ని సేవలు అందిస్తానని వేడుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయనతోపాటు ఉన్నారు.