NZB: సదాశివనగర్ మండల కేంద్రంలో బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సవిత్రీ బాయి ఫూలే దంపతులు, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ & రమాబాయి దంపతుల మహనీయుల విగ్రహాలను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం, విద్య, హక్కుల సాధన కోసం ఈ మహనీయుల జీవితాలు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.