CTR: ప్లాస్టిక్ కవర్ల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలో ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేసి వాటి వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించారు.