SRCL: భూ భారతి, నూతన ఆర్ఓఆర్ చట్టంను రైతులు సద్విని చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని, చట్టంలోని వివిధ అంశాలను, ప్రయోజనాలను ప్రెజెంటేషన్ ద్వారా రైతులు, ప్రజలకు క్లుప్తంగా జిల్లా కలెక్టర్ వివరించారు.