PLD: చిలకలూరిపేట రూరల్ ఈవూరివారిపాలెం గ్రామంలో శ్రీఅభయ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి శిలా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీ సీతారామ కళ్యాణంలో కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.