PPM: అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. వాతావరణ శాఖ విడుదల చేసిన సూచనల మేరకు జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న మూడు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, గాలులు 60 కిలోమీటర్లు వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ సూచనలు చేసిందన్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.