KDP: సిద్ధవటం మెజిస్ట్రేట్ కోర్టు ఏజీపీగా ఒంటిమిట్టకు చెందిన ఆదినారాయణ నియమితులయ్యారు. సిద్ధవటం, కడప తదితర ప్రాంతాల కోర్టులో 12 ఏళ్లుగా న్యాయవాదిగా గుర్తింపు పొందారు. కాగా ఒంటిమిట్టలో కొన్నేళ్లుగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. పార్టీకి చేసిన సేవలు న్యాయవాదిగా చేసిన సేవలను గుర్తించి తమకు ఏజీపీగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.