ప్రకాశం: కంభం మండలంలో బుధవారం ఉరుములు, మెరుపులు, పిడుగులు బీభత్సం సృష్టించాయి. మండలంలోని హజరత్ గూడెంలో వెంకటేశ్వర్లు అనే రైతుకు సంబంధించిన రెండు గేదెలు పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. ఈ ఘటనలో సుమారు రూ.1,40,000 నష్టం వాటిలిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని స్థానిక రైతు వాపోయాడు.