SRD: సంగారెడ్డి జిల్లాలో మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని చెప్పారు. నిబంధనలు ఉల్లంగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.