NLR: కందుకూరులోని జనార్ధన్ కాలనీలో ఉర్దూ స్కూల్ వద్ద రూ.35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు గురువారం ప్రారంభించారు. దాంతోపాటు పుట్ట ఏరియాలో రూ.14 లక్షలతో నిర్మించనున్న మురుగు కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు, TDPముస్లిం మైనార్టీ పాల్గొన్నారు.