W.G: ప్రజల నుంచి వసూలు చేసిన ప్రతి రూపాయి ప్రజా ఉద్యమాల కోసం ఖర్చు చేస్తున్నట్లు CITU రాష్ట్ర కార్యదర్శి ఉమా మహేశ్వరరావు అన్నారు. మంగళవారం భీమవరంలో CITUఅఖిలభారత మహాసభల జయప్రదం కోసం ఇంటింటా నిధి సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉద్యోగులు, కార్మికులకు అనేక చట్టాలు ఉన్నప్పటికీ అవి అమలు కావడం లేదన్నారు. దానికోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
E.G: మురళికొండ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారేలా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. మంగళవారం బొమ్మూరు పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మొత్తం 11 పనుల ద్వారా రోడ్లు, కాలువలు మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.
KRNL: ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి బసాపురం ఎస్‌ఎస్ ట్యాంక్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ట్యాంక్ మరమ్మతులు నీటి నిల్వ సామర్థ్యం పెంపు పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ అభివృద్ధితో రైతులకు సాగునీటి లాభాలు చేకూరుతాయని తెలిపారు. ఈ సమావేశంలో అధికారులు, స్థానిక నాయకులు ఉన్నారు.
ASR: గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలను తీసుకు వచ్చారని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజా రాణి తెలిపారు. ఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడారు. పేద ప్రజలకు వైద్యం చేరువ చేయాలనే ఉద్దేశంతో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం దారుణమన్నారు.
ATP: జిల్లాలోని వివిధ సబ్ డివిజన్ల పరిధిలో శక్తి టీమ్స్ పలు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో మహిళల భద్రత, హక్కులు, చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించాయి. యాడికి కేజీబీవీ, గుంతకల్లు శంకరానంద డిగ్రీ కళాశాల, ఎస్‌కేయూ హాస్టల్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. శక్తి యాప్ ఉపయోగాలు, డయల్-100 లేదా 112 వంటి సేవల గురించి వివరించారు.
NDL: ప్రజా ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఆళ్లగడ్డ పట్టణంలో 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. మంగళవారం ఆళ్లగడ్డ పట్టణంలో రూ. 6 కోట్లతో అధునాతన వైద్య పరికరాలతో 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో కలిసి ప్రారంభించారు.
WGL: నేషనల్ హెరాల్డ్ (యంగ్ ఇండియన్) కేసును కోర్టు కొట్టివేయడం బీజేపీ ప్రభుత్వానికి చావుదెబ్బ అని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం అన్నారు. మంగళవారం వర్ధన్నపేట పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ దర్యాప్తు చట్ట విరుద్ధమని కోర్టు తేల్చిందన్నారు. ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసేనని విమర్శించారు. ధర్మమే గెలిచిందని, అధర్మం ఓడిపోయిందని తెలిపారు.
SRCL: సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ మరో అద్భుతం సృష్టించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేకించి అగ్గిపెట్టెలో ఇమిడి రెండు గ్రాముల బంగారు చీరను మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవో వెంకటస్వామికి అందించారు. దీని పొడవు 5:30 మీటర్లు వెడల్పు 48 ఇంచులు దీనిని తయారు చేయుటకు వారం రోజుల వ్యవధి పట్టిందన్నారు.
SRPT: మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ, సీపీఎం సీనియర్ నాయకులు మూరగుండ్ల లక్ష్మయ్య (80) మంగళవారం ఉదయం మృతి చెందారు. ఆయన 2006-2011 వరకు తుంగతుర్తి జడ్పీటీసీగా పనిచేశారు. సీపీఎం పార్టీలో చురుకుగా ఉంటూ పలు ప్రజా పోరాటాలు, ఉద్యమాలు చేశారు. ఆయన మృతి పట్ల సీపీఎం నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణ వార్డు సమస్యలపై సహకరించడం లేదని బీజేపీ నాయకులు గంజం పెంచల ప్రసాద్ ఆరోపించారు. వార్డులలో జరిగే ప్రతీ కార్యక్రమానికి కమిషనర్ తప్పకుండా హాజరయ్యే విధంగా చూడాలని తెలిపారు. కమిషనర్ ప్రవర్తిస్తున్న తీరు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
NLG: గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ ఉండటంతో ఈసారి ఆ పదవికి భారీగా డిమాండ్ ఏర్పడింది. కట్టంగూరు గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ పదవిని దక్కించుకుని గ్రామంలో తమ ప్రాధాన్యతను చాటుకోవాలనే ఉద్దేశంతో కొందరు అభ్యర్థులు ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడటం లేదని చర్చ జరుగుతోంది.
SRPT: కోదాడ పట్టణ అభివృద్ధికి మాజీ సర్పంచ్ చిట్టబత్తిని సుబ్బరామయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ వంగవీటి రామారావులు అన్నారు. మంగళవారం సుబ్బరామయ్య 16వ వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సత్యసాయి: సినీ హీరో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ OG దర్శకుడు సుజీత్‌కు ప్రత్యేక బహుమతి అందజేశారు. కదిరి ప్రాంతానికి చెందిన సుజీత్‌కు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కానుకగా ఇచ్చారు. ఈ విషయాన్ని సుజీత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బాల్యం నుంచే పవన్ అభిమానినైన తాను ఈ బహుమతి పొందడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
KNR: బాల్య వివాహాల నిర్ములన అందరి బాధ్యతయని, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కరీంనగర్ జిల్లా కో- ఆర్డినేటర్ ఆవుల సంపత్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామంలోని మహిళా సంఘాలకు, పాఠశాల, అంగన్వాడి కేంద్రంలో ‘బాల్య వివాహ ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా అవగాహన నిర్వహించారు. బాల్య వివాహాలను నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత, బాల్య వివాహాలు చేయవద్దన్నారు.
KMM: రఘునాథపాలెం మండలం జింకల తండా, పువ్వాడ నగర్ పరిధిలో టీజీఐఐసీకి కేటాయించిన భూములను కలెక్టర్ అనుదీప్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలత, మౌళిక వసతుల లభ్యతపై అధికారులతో చర్చించారు. భూముల సరిహద్దులను మ్యాప్‌ల ఆధారంగా సర్వే చేసి కేటాయించాలని ఆదేశించి, ఖమ్మం జిల్లాను పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.