• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సౌతాఫ్రికాపై కివీస్ ఘన విజయం

సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 137 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్ జట్టు 16.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు టామ్ లాథమ్ (63*), డెవాన్ కాన్వే (39) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ విజయంతో న్యూజిలాండ్‌ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉంది.

March 20, 2026 / 04:27 PM IST

చింతలపల్లిలో CI పర్యటన

KDP: కలసపాడు(మం) చింతలపల్లిలో శుక్రవారం పోరుమామిళ్ల CI హేమ సుందర్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు రోడ్డు మలుపుల వద్ద తరచూ జరుగుతున్న ప్రమాదాలను వారికి వివరించారు. యాక్సిడెంట్‌లు నివారించేందుకు కీలక ప్రాంతాల్లో, గ్రామంలో CC కెమెరాలు, భారీ కేడ్లు ఏర్పాటు చేయాలని CIను కోరారు. సీఐ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

March 20, 2026 / 04:27 PM IST

విద్యాశాఖకు 8 శాతం నిధులా?.. సిగ్గుచేటు: ఎమ్మెల్సీ

TG: బడ్జెట్‌లో విద్యాశాఖకు ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపించిందని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య విమర్శించారు. బడ్జెట్ అంతా అంకెల గారడీ.. అభూత కల్పనలానే ఉందన్నారు. విద్యాశాఖకు కేవలం 8 శాతం నిధులు కేటాయించడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మౌలిక వసతులు లేవు.. టీచర్ల నియామకాలు లేవని మండిపడ్డారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల ప్రస్తావన లేదని ధ్వజమెత్తారు.

March 20, 2026 / 04:26 PM IST

పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించాలి: కలెక్టర్

BHNG: విద్యార్థులు కష్టపడి చదివి పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. శుక్రవారం చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య, విద్యా పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

March 20, 2026 / 04:26 PM IST

ఎస్సీ అభ్యర్థులకు దరఖాస్తులకు ఆహ్వానం

SRD: షెడ్యూల్ కులాలకు చెందిన అభ్యర్థులకు వివిధ పథకాల లబ్ధి కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు MPDO శారద తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సోలార్ పంపు, విద్యుత్ ద్విచక్ర వాహనాల అవసరానికి గాను 2025-26 ప్రకారం బ్యాంకు ద్వారా రుణ సహాయం పొందవచ్చన్నారు. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు ఈనెల 24 వరకు ఆన్‌లైన్‌లో https://tgobmms.cgg.gov.in దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

March 20, 2026 / 04:25 PM IST

అదృశ్యమైన యువకుడి మృతదేహం లభ్యం

NLR: సైదాపురం మండలం చాగణం గ్రామానికి చెందిన మణికంఠ 3 రోజుల నుంచి కనపడకుండా పోయిన విషయం తెలిసిందే. పోలీసులు గాలింపు చర్యల్లో భాగంగా శుక్రవారం యువకుడు బైక్ జోరేపల్లి తెలుగు గంగ కాలువ దగ్గర ఉన్నట్టు గుర్తించారు. మణికంఠ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

March 20, 2026 / 04:23 PM IST

అధ్యక్ష పదవీ కోసం పార్టీ అధిష్ఠానం సన్నాహాలు

VKB: జిల్లా బీజేపీ అధ్యక్ష పదవీ భర్తీ కోసం రాష్ట్ర నేతలు స్థానిక హోటల్‌లో సీనియర్ నాయకుల అభిప్రాయాలను సేకరించారు. గతంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పదవి నుంచి తొలగించబడి, కర్ణం ప్రహల్లాద్ రావు కన్వీనర్‌గా నియమితులయ్యారు. కొత్త పోటీలో శివరాజ్, రమేష్ తదితరులు పాల్గొంటున్నారు. అధిష్ఠానం త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నారు.

March 20, 2026 / 04:22 PM IST

మన్నెగూడెంలో కొత్త వాటర్ ప్లాంట్ ప్రారంభం

MBNR: బాలానగర్ మండలం మన్నెగూడెం తండాలో శుక్రవారం సర్పంచ్ రాజు నాయక్, ఉపసర్పంచ్ హిర్య నాయక్ పాల్గొని నూతన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. గ్రామస్తులకు పరిశుభ్రమైన తాగునీరు అందించడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ప్లాంట్ ద్వారా ప్రజలు సులభంగా సురక్షిత నీటిని పొందగలుగుతారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు కూడా పాల్గొన్నారు.

March 20, 2026 / 04:22 PM IST

పోలీసులు నిజాయితీతో వ్యవహరించాలి: SP

ADB: ప్రతి ఒక్క పోలీసు నిజాయితీతో వ్యవహరించాలని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక పోలీసు సాయుధ ముఖ్య కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విధులలో నిర్లక్ష్యాన్ని వహించకూడదని తెలిపారు. సిబ్బంది కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని SP అఖిల్ మహాజన్ కోరారు.

March 20, 2026 / 04:22 PM IST

ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి

ASR: సాలూరు నియోజకవర్గ ప్రజల చిరకాల కల నెరవేరిందని మంత్రి సంధ్యారాణి అన్నారు. అత్యుత్తమ వైద్య సేవలను స్థానికులకు అందుబాటులోకి తీసుకువస్తూ, సుమారు రూ. 17 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల అత్యాధునిక ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి పాల్గొన్నారు.

March 20, 2026 / 04:20 PM IST

సదరం పరిధిలోకి మరో ఐదు వైకల్యాలు: మంత్రి

సత్యసాయి: మరో ఐదు రకాల వైకల్యాలను సదరం పరిధిలోకి చేర్చినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. యాసిడ్ దాడి బాధితులు, ఆటిజం, లెర్నింగ్ డిజార్డర్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్, బహుళ వైకల్యాల వారికి డిజిటల్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఈ నెల 25 నుంచి స్లాట్ బుకింగ్, 30 నుంచి వైద్య పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.

March 20, 2026 / 04:20 PM IST

రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలి: సోమయ్య

JN: రైతు భరోసా నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య అన్నారు. పాలకుర్తి(M) గూడూరు గ్రామంలో రైతు సంఘం కరపత్రాలను ఇవాళ ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర లభించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

March 20, 2026 / 04:20 PM IST

కొత్త పెన్షన్ల మంజూరు నిర్ణయం ఎంతో హర్షణీయం: సీతక్క

MLG: అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మంత్రి సీతక్క కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం మీడియాతో సీతక్క మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధికి వెన్నెముకగా నిలిచే పంచాయతీరాజ్ శాఖకు అత్యధిక కేటాయింపులు చేయడం, సామాజిక భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, రెండు లక్షల కొత్త పెన్షన్ల మంజూరు నిర్ణయం ఎంతో హర్షణీయమని స్పష్టం చేశారు.

March 20, 2026 / 04:20 PM IST

ఆర్టీసీ రక్షణకు ఐక్య పోరాటం చేద్దాం: సీఐటీయూ

SRPT: ప్రైవేట్ విద్యుత్ బస్సుల విధానం వల్ల ఆర్టీసీ మనుగడ, ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడ్డాయని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు అన్నారు. 2021, 2025 వేతన సవరణలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సూర్యాపేట డిపో వద్ద సంతకాల సేకరణ నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న జరిగే రాష్ట్రవ్యాప్త ధర్నాలో కార్మికులందరూ పాల్గొలని కోరారు.

March 20, 2026 / 04:20 PM IST

ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు: రేవంత్ రెడ్డి

TG: విద్యావిధానంలో కీలక మార్పులు తెస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇకపై పదో తరగతి పరీక్షలు ఉండవని స్పష్టం చేశారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం ఉంటుందని తెలిపారు. అంటే 10వ తరగతి వద్ద విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా, నేరుగా 12వ తరగతి వరకు ఒకే గొడుగు కింద చదువుకునేలా మార్పులు చేస్తున్నారు.

March 20, 2026 / 04:15 PM IST