• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తెలంగాణ బడ్జెట్: కార్మికశాఖకు రూ.998 కోట్లు

➠ వ్యవసాయ శాఖ రూ.23,179 కోట్లు➠ విద్యుత్ శాఖ రూ.21,285 కోట్లు➠ పౌరసరఫరాల శాఖ రూ.7,366 కోట్లు➠ పశుసంవర్ధక శాఖ రూ.1,529 కోట్లు➠ కార్మికశాఖ రూ.998 కోట్లు➠ మహిళ, శిశు సంక్షేమశాఖ రూ.3,143 కోట్లు➠ పర్యాటక రంగం రూ.1,224 కోట్లు➠ ఎస్సీ సంక్షేమం రూ.11,784 కోట్లు➠ ఎస్టీ సంక్షేమం రూ.7,934 కోట్లు

March 20, 2026 / 12:25 PM IST

ముస్లింలకు రంజాన్ తోఫా అందజేత

SDPT: తొగుట మండలం పెద్ద మాసాన్ పల్లి గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా గ్రామ సర్పంచ్ పన్యాల ప్రవీణ్ రెడ్డి గ్రామంలోని 10 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు. గత 10 ఏళ్లుగా ఆయన ఈ తోఫాను అందజేస్తున్నారు. ఆయన చేస్తున్న సేవకు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోయిని శ్రీనివాస్, వార్డ్ సభ్యులు కిషన్, స్వామి, రాజు, మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

March 20, 2026 / 12:25 PM IST

ముస్లిం సోదరుల ప్రార్థన కోసం స్థలం ఏర్పాటు

KMM: ఎమ్మెల్యే రాందాస్ మాలోత్ ఆదేశాల మేరకు ప్రార్థనల నిమిత్తం కేటాయించిన స్థలాన్ని శుక్రవారం వార్డు కౌన్సిలర్ శ్రావణి రత్నాకర్, నాయకుడు కాప మురళీకృష్ణ పర్యవేక్షించారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరుల ప్రార్థనల కోసం వైరాలోని 4వ వార్డులో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

March 20, 2026 / 12:21 PM IST

తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇలా

➠ రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు➠ మూలధన వ్యయం రూ.47,267 కోట్లు➠ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లు➠ వృద్ధి రేటు 10.2 శాతం➠ జీఎస్‌డీపీ రూ.17 లక్షల 82 వేల కోట్లు➠ రైతుభరోసా రూ.18 వేల కోట్లు➠ చేయూత రూ.14,861 కోట్లు➠ ఇందిరమ్మ ఇళ్లు రూ.5,500 కోట్లు

March 20, 2026 / 12:21 PM IST

గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన యువకులు

ASR: రాజవొమ్మంగికి చెందిన కొంతమంది యువత సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో గంజాయి రవాణాకు పాల్పడుతున్నారు. ఇటీవల వారిలో కొంతమందిని గంజాయితో చెన్నై, జడ్డంగి పోలీసులు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేశారు. పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా కొంతమంది ఇలాంటి ఘటనలకు పాల్పడడం పరిపాటిగా మారుతోంది. 3 నెలల కాలంలో 8 మంది యువత గంజాయి కేసుల్లో పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు.

March 20, 2026 / 12:20 PM IST

ఆ భాష తెలియక నటించా: నోరా ఫతేహీ

కన్నడ చిత్రం ‘కేడీ’లోని ‘సర్కే చునార్ తేరీ’ పాట వివాదానికి దారితీయడంతో.. కేంద్ర ప్రభుత్వం దానిపై నిషేధం విధించింది. ఈ పాట ఇస్లామిక్ బోధనలకు విరుద్ధంగా ఉందంటూ నటి నోరా ఫతేహీపై ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తా అనే మతపరమైన సంస్థ కూడా ఫత్వా జారీ చేసింది. దీనిపై నటి నోరా ఫతేహీ స్పందిస్తూ.. తనకు ఆ భాష తెలియదని, సినిమా నేపథ్యం చూసి మాత్రమే నటించానని వివరణ ఇచ్చింది.

March 20, 2026 / 12:20 PM IST

కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌కు సుప్రీం షాక్

TG: గవర్నర్ కోటా MLCలు కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. హైకోర్టు విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసి, శాసనమండలి సమావేశాల్లో పాల్గొనేలా అవకాశం ఇవ్వాలన్న వారి విన్నపాన్ని ధర్మాసనం తోసిపుచ్చింది. ముందుగా హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది.

March 20, 2026 / 12:18 PM IST

పోచంపల్లి వాసికి గద్దర్ ఫిల్మ్ అవార్డు

BHNG: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2025’ లో “UNITY – The Man of Social Justice” డాక్యుమెంటరీ మొదటి ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా నిలిచింది. సామాజిక బాధ్యత, చారిత్రక నేపథ్యం కలగలిసిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన భూదాన్ పోచంపల్లి వాసి విజయ్ కుమార్ బడుగు అవార్డును అందుకున్నారు.

March 20, 2026 / 12:17 PM IST

బొంకూర్ జాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి

JGL: గొల్లపల్లి మండలంలోని బొంకూర్ గ్రామంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, బొంకూర్ జాతర మహోత్సవాల వాల్ పోస్టర్‌ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప పొందాలని ఆయన కోరారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు.

March 20, 2026 / 12:17 PM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత.

EG: దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆదేశాల మేరకు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూచిపూడి శ్రీనివాస్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు .వైద్య ఖర్చుల నిమిత్తం లబ్దిదారులైన దాసరి సత్య కోటేశ్వరరావుకు రూ.2,50,000/-చెక్కును శుక్రవారం అందజేశారు. సర్పంచ్ నాయుడు దుర్గాప్రసాద్, జనరల్ సెక్రటరీ చెల్లిoకి వాసు తదితరులు పాల్గొన్నారు

March 20, 2026 / 12:17 PM IST

కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి: IFTU

ADB: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మార్చి23న సెంట్రల్ లేబర్ కార్యాలయం హైదరాబాద్‌లో తలపెట్టిన ధర్నా కార్యక్రమం గోడప్రతులను సంఘం నాయకులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. నాయకులు సుభాష్, నర్సింగ్, దేవిదాస్, తదితరులున్నారు.

March 20, 2026 / 12:16 PM IST

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ కేసు.. తీర్పు వాయిదా

TG: మోయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణ పూర్తయింది. ఉప్పరిపల్లి కోర్టు ఈ పిటిషన్‌ను సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో అరెస్టయిన పైలట్ రోహిత్ రెడ్డి, రితీశ్ రెడ్డి, నమిత్ శర్మను విచారించేందుకు వారం రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. నిందితుల నుంచి సమాచారం రాబట్టడం అత్యవసరమని పోలీసులు పేర్కొన్నారు.

March 20, 2026 / 12:15 PM IST

గరికపాటి వాక్యాలు వెనక్కి తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్

GNTR: గరికపాటి నరసింహా రావు ఇటీవల పాఠశాల విద్యార్థుల గురించి చేసిన వ్యాఖ్యలను AISF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్ జీ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. గరికపాటి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

March 20, 2026 / 12:14 PM IST

BREAKING: బడ్జెట్ @ రూ.3,24,234 కోట్లు

TG: అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క 2026-27కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించారు. రూ.3,24,234కోట్లతో ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. తాము పాలకులం కాదని.. ప్రజలకు సేవకులం అని స్పష్టం చేశారు. ప్రజలే తమకు పరమావధి అని తెలిపారు.

March 20, 2026 / 12:14 PM IST

శ్రీరామనవమి వేడుక పోస్టర్ ఆవిష్కరణ

VKB: బొంరాస్‌పేట మండల కేంద్రంలో భక్త సమాజం ఈనెల 27న జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించింది. స్థానిక సర్పంచ్ వీరేశలింగం పోస్టర్‌ను ప్రారంభించి భక్తులు వేడుకను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురోహితుడు జోషి సత్యనారాయణరావు, గ్రామ పెద్దలు నర్సింలు గౌడ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

March 20, 2026 / 12:13 PM IST