JGL: గొల్లపల్లి మండలంలోని బొంకూర్ గ్రామంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, బొంకూర్ జాతర మహోత్సవాల వాల్ పోస్టర్ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప పొందాలని ఆయన కోరారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు.