VKB: బొంరాస్పేట మండల కేంద్రంలో భక్త సమాజం ఈనెల 27న జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించింది. స్థానిక సర్పంచ్ వీరేశలింగం పోస్టర్ను ప్రారంభించి భక్తులు వేడుకను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురోహితుడు జోషి సత్యనారాయణరావు, గ్రామ పెద్దలు నర్సింలు గౌడ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.