CTR: తవణంపల్లె మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళీమోహన్ శనివారం ప్రారంభోత్సవం చేశారు. వెంగంపల్లి, గోవిందరెడ్డి పల్లె, ఏ గొల్లపల్లె గ్రామాలలో నూతన అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించారు. ఏ గొల్లపల్లిలో స్మశాన వాటిక ప్రహరీని ప్రారంభించారు. మౌలిక వసతుల కల్పనకు తగిన ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు.