ADB: ఆలయాల అభివృద్ధితో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. సోనాల మండలంలోని సాకేర గ్రామంలో మందిరానికి వెళ్లే మెట్ల మార్గానికి రూ.2.5 లక్షల నిధులతో భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి, ఆలయాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని గజేందర్ పేర్కొన్నారు.