VSP: వైసీపీ ఎస్సీ విభాగ పరిశీలకురాలిగా గండి భాగ్యవతి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ అధ్యక్షుడు కేకే రాజును కలిశారు. ఎస్సీ విభాగాన్ని బలోపేతం చేయడానికి వార్డు, సచివాలయం స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి సమన్వయంతో పని చేయాలని కేకే రాజు ఆమెకు సూచించారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.