TG: రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు జీవిత బీమాను ప్రభుత్వం ప్రకటించిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగులకు ప్రత్యేక బీమాను పెట్టామన్నారు.