BDK: పాల్వంచ మండలం జగన్నాధపురంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో దేవి వసంత నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శనివారం మూడో రోజు దేవి నవరాత్రుల్లో ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. మల్లెపూలతో లక్ష కుసుమార్చిన పూజలు చేశారు. తెల్లవారుజామున ఆలయంలో సుప్రభాత సేవ, ప్రాతఃకాల పూజ, శ్రీ చక్రార్చన, సూర్య నమస్కారములు, మూలమంత్ర అను స్తానం పూజలు చేశారు.