ముఖ్యంగా నిద్ర లేమితో మగవాళ్లకు.. ఆడవాళ్ల లక్షణాలు వస్తాయని వైద్యులు అంటున్నారు. మగవాళ్లలో రాత్రి పూట టెస్టోస్టెరాన్ లాంటి ‘లైంగిక’ హార్మోన్లు విడుదలవుతాయి. ఒకవేళ రాత్రి నిద్రలేకపోతే మగవాళ్ల శరీరంలో ఆడవాళ్లకు సంబంధించిన ఈస్ట్రడయాల్ (ఈ2) హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో తెలియకుండానే మగవాళ్లలో అడవాళ్ల లక్షణాలు వస్తాయి. ఆలోచనల తీరు మారుతుంది. ప్రవర్తనలో తేడా వస్తుంది.