• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి

KMM: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బోదులబండలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొంగులేటి ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజలు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. క్వింటాకు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు.

April 4, 2025 / 12:32 PM IST

పెద్దపల్లి: చలి వేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

పెద్దపల్లి: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వ ఐటీఐ పెద్దపల్లి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని శుక్రవారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ ఛైర్మన్ ఈర్ల స్వరూప, పాల్గొన్నారు.

April 4, 2025 / 12:26 PM IST

విద్యాశాఖపై సీఎం రేవంత్ ఫోకస్

TG: విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విద్యా కమిషన్‌తో ఆయన సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఉన్నతాధికారులతో, సాయంత్రం 6:30 గంటలకు అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో ఆయన సమావేశమై కీలక అంశాలపై చర్చించనున్నారు.

April 4, 2025 / 11:20 AM IST

విద్యుత్ సిబ్బంది మృతిపై మంత్రి దిగ్భ్రాంతి

BPT: బాపట్ల జిల్లా కొల్లూరులో విద్యుత్ సిబ్బంది మృతిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా సిబ్బంది చనిపోవడంపై విచారకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తునకు ఆదేశించారు.

April 4, 2025 / 11:15 AM IST

మిర్చి ధరల వివరాలు ఇలా..

WGL: ఎనుమాముల మార్కెట్లో వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకు గురువారం రూ.13,150 పలకగా.. నేడు రూ.12,900 పలికింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.11,500 ధర రాగా.. నేడు రూ.11,200 ధర వచ్చింది. మరోవైపు వండర్ హాట్(WH) రకానికి నిన్నటిలాగే రూ.14వేల ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

April 4, 2025 / 11:14 AM IST

పల్నాడు జిల్లాలో ఒకరి హత్య

PLD: మాచర్ల నియోజకవర్గ పరిధిలో హరిచంద్ర అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఆయన మృతదేహం పొలంలో ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. కాగా రెండు రోజుల క్రితం నాగార్జున్ సాగర్ హిల్ కాలనీలో హరిచంద్ర కిడ్నాప్‌కు గురయ్యారు. రెండు రోజుల తర్వాత ఆయన శవమై కనిపించారు. పోలీసులు తమకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

April 4, 2025 / 11:07 AM IST

గల్లంతైన మృతదేహం లభ్యం

ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎర్రకాలువలో గల్లంతైన చల్లా బసవయ్య(70) మృతదేహం ఇవాళ ఉదయం లభ్యమైంది.  గురువారం సాయంత్రం గేదెలను కడగటానికి నీటిలోకి దిగి ఊబిలో కూరుకుపోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై శశాంక్ గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు.

April 4, 2025 / 11:02 AM IST

మాకవరపాలెం ఎంపీపీగా రుత్తల సర్వేశ్వరరావు బాధ్యతలు

అనకాపల్లి: మాకవరపాలెం నూతన ఎంపీపీగా రుత్తల సర్వేశ్వరరావు(సర్వం) శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ హాజరయ్యారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీ మాట్లాడుతూ.. మండలాభివృద్ధికి  తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

April 4, 2025 / 10:59 AM IST

నరసరావుపేట పోస్టల్ కార్యాలయం ఎదుట ఆందోళన

PLD: నరసరావుపేట పోస్టల్ కార్యాలయం ఎదుట తమ సమస్యలు పరిష్కరించాలని ఆ శాఖ విశ్రాంత ఉద్యోగులు శుక్రవారం ఆందోళనకు దిగారు. పాత పెన్షన్ విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు. కోవిడ్ కాలంలో ఆపిన మూడు డీఏలు చెల్లించాలన్నారు. గుర్తింపు లేని ఆసుపత్రులు అందుబాటులో లేకుంటే మెడికల్ అలవెన్స్ పెన్షనర్లకు ఇవ్వాలన్నారు.

April 4, 2025 / 10:49 AM IST

వేములవాడ రాజన్నను దర్శించుకున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సభ్యులు

SRCL: వేములవాడ, శ్రీ రాజరాజేశ్వర స్వామిని శుక్రవారం ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కుస్రం నీలా దేవి, కొంకటి లక్ష్మీనారాయణ, రేణికుంట ప్రవీణ్‌లు దర్శించుకున్నారు. మిషన్ ఛైర్మన్, సభ్యులు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు లడ్డు ప్రసాదం అందజేశారు.

April 4, 2025 / 10:34 AM IST

రైతులను తీవ్రంగా నష్టపరిచిన అకాల వర్షం

BPT: పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో అర్ధరాత్రి కురిసిన వర్షం రైతులను తీవ్రంగా నష్టపరిచింది. కోత అనంతరం కళ్లాల్లో అరబోసిన ధాన్యం పూర్తిగా తడవడంతో, రైతులు పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎత్తేందుకు, ఎండబెట్టేందుకు తీవ్ర శ్రమ పడుతున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని తగిన ధరకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

April 4, 2025 / 09:47 AM IST

11 బీఈడీ కళాశాలలకు నోటీసులు

GNTR: ANU పరిధిలోని 11 బీఈడీ కళాశాలలకు ఎన్సీటీఈ నోటీసులు జారీ చేసింది. గుంటూరు, నరసరావుపేట, రేపల్లె ప్రాంతాల్లోని కళాశాలల పనితీరు అంచనాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. మార్చిలో ప్రశ్నపత్రం లీక్, ప్రయోగ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, కళాశాలలు విద్యార్థుల నుంచి అధిక రుసుములు వసూలు చేయడం వంటి అంశాలపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

April 4, 2025 / 09:22 AM IST

వర్షానికి నేలకొరిగిన స్తంభం.. తప్పిన ప్రమాదం

BDK: నిన్న కురిసిన వర్షానికి కొత్తగూడెం టౌన్ నాగయ్య గడ్డలో విద్యుత్ స్తంభం నేలకు ఒరిగింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఆ విద్యుత్ స్తంభం పై విద్యుత్ తీగలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నెల రోజుల క్రితం కొత్త లైన్ కోసం వేసిన విద్యుత్ స్తంభానికి నేటికి కనెక్షన్ ఇవ్వలేదని మాజీ కౌన్సిలర్ రూప అన్నారు.

April 4, 2025 / 09:14 AM IST

ఘనంగా సీతారాములకు తిరువీధి సేవ

BDK: శ్రీరామచంద్ర స్వామికి తిరువీధి సేవ ఘనంగా జరిగింది. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం బేరి పూజ, దేవత ఆహ్వానం వేడుకలు జరగనున్నాయి. ఏప్రిల్ 5న సాయంత్రం సీతారాములకు ఎదుర్కోలు మహోత్సవం, ఏప్రిల్ 6న ఉదయం 10:30 నిమిషాల నుంచి 12:30 నిమిషాల వరకు మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.

April 4, 2025 / 09:09 AM IST

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి

SRPT: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలం హనుమంతుల గూడెం గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు గరిడేపల్లి మండలం కల్మల్ చెరువు గ్రామానికి చెందిన యాతం సైదులుగా గుర్తించారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్యం హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

April 4, 2025 / 08:14 AM IST