ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎర్రకాలువలో గల్లంతైన చల్లా బసవయ్య(70) మృతదేహం ఇవాళ ఉదయం లభ్యమైంది. గురువారం సాయంత్రం గేదెలను కడగటానికి నీటిలోకి దిగి ఊబిలో కూరుకుపోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై శశాంక్ గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు.