ప్రకాశం: పాత సింగరాయకొండ గ్రామంలో ఉన్న ప్రసిద్ధిగాంచిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం అక్షయ తృతీయ వేడుకలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు స్వామివారికి చందనాలంకారం, లక్ష తులసి పూజ నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ అధికారులు కోరారు. స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.