CTR: జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బుధవారం నుంచి స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి తెలిపారు. ఈ నెల 4న తొలుత జిల్లా కేంద్రంలోని ఆర్వో(అర్బన్) కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేశామన్నారు. ఈ నెల 30 నుంచి మిగిలిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నామన్నారు.