NLR: ముత్తుకూరు మండలం నేలటూరులోని శ్రీదామోదరం సంజీవయ్య ఏపీజెన్కో ప్రాజెక్టులో మూడు యూనిట్ల నుంచి విద్యుదుత్పత్తి జరుగుతున్నట్టు ఆ ప్రాజెక్టు ఇంజినీర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా 1వ యూనిట్లో 460, 2వ యూనిట్లో 565, 3వ యూనిట్లో 630 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతున్నట్టు పేర్కొన్నారు.