నెల్లూరు దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతి నగర్లో ఈ నెల 9న పామూరు ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ వాసు అనే యువకుడిని కిరాతకంగా హత్య చేసి డంపింగ్ యార్డ్లో పడేశారు. ఈ కేసు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. కారు డ్రైవర్ వాసు హత్య కేసులో 9మంది నిందితులను కోర్టు అనుమతితో పోలీస్ స్టేషన్కు తరలించారు.