ADB: రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో ఈనెల 9 నుంచి అండర్-15 రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫుట్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఈనెల 9 నుంచి 12 వరకు జరుగుతాయని, పోటీలకు ఉమ్మడి జిల్లాల నుంచి 12 జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు.