NGKL: సమాజంలో మహిళలు, బాలికలు తెలిసినవారితోనే ఎక్కువగా వేధింపులకుగురవుతున్నారని షీటీం జిల్లా ఇన్చార్జి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తెలకపల్లి MJP పాఠశాలలో చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వేధింపులకు గురైనప్పుడు అధైర్యపడకుండా షీటీంను సంప్రదించాలని ఆమె సూచించారు.