NLR: వేమిరెడ్డి దంపతులపై నీచమైన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రసన్న తీరు మారకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.