కోనసీమ: రామచంద్రపురం మండలం హసన్ బాద గ్రామంలో సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు ఆద్వర్యంలో మంగళవారం వికసిత్ భారత్ 11 సంవత్సరాల ప్రధాని మోదీ సుపరిపాలన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పథకాల అభివృద్ధిపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మోదీ అభివృద్ధి పథకాల కరపత్రాలను ప్రజలకు అందజేసారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.