SRD: విద్యార్థులకు అర్థమయ్యేలా ఉపకరణాలు ఉపయోగించి బోధించాలని కలెక్టర్ ప్రావీణ్య ఉపాధ్యాయులకు సూచించారు. కంది మైనార్టీ గురుకుల పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగారు. చదువుకుంటే మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులకు సూచించారు.